• Home
  • Trending Today
  • ఒకే స్కూలుకు చెందిన 6గురు విద్యార్థులు అదృశ్యం.. తిరుపతిలో కలకలం
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు విద్య వార్తలు

ఒకే స్కూలుకు చెందిన 6గురు విద్యార్థులు అదృశ్యం.. తిరుపతిలో కలకలం

Six 10th Class Students Missing in Tirupati Private School

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6గురు విద్యార్థులు రెండ్రోజులనుంచి జాడ లేకుండా పోయారు.. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ వారిని మందలించి తల్లుదండ్రులను తీసుకువస్తేనే తరగతి గదిలోకి అనుమతిస్తానని చెప్పడంతో స్కూలు నుంచి వెళ్లిన విద్యార్థులు రెండు రోజులుగా ఇంటికి చేరుకోకపోవడంతో స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు.. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు వివరాలు సేకరించి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు…

వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ స్కూలులో పదవ తరగతి చదువుతున్న ఆ ఆరుగురు విద్యార్థులు నిన్న గురువారం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో సదరు స్కూల్ ప్రిన్సిపాల్ వారిని మందలించాడు.. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా హెచ్చరించగా ఇంట్లో తిడతారేమోనని భయపడిన బాలురు ఇంటికి వెళ్లకుండా స్కూలు నుంచి నేరుగా స్థానికంగా ఉండే సినిమా థియేటర్ కు వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.. అయితే ఆ 6గురు విద్యార్థులు సినిమా అయిపోయిన తరువాత కూడా ఇంటికి వెళ్లకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.. స్కూలు యాజమాన్యం వేధింపుల వల్లే పిల్లు కనిపించకుండా పోయారంటూ ఆరోపిస్తున్నారు..

Related posts

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ దానికి నో చెప్పింది… !ఇరకాటంలో దర్శకనిర్మాతలు

nagaraj chanti

పాక్ మాజీ కెప్టెన్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ…!ఆసియా కింగ్

nagaraj chanti

సుదీర్ బాబు మీట్ భీమవరం..ఫాన్స్.. ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment