telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లుపై ..రెండు రెండు నాలుకల ధోరణిలో శివసేన..

sivasena fire on bjp's words

శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుపై తీవ్రవిమర్శలు చేసింది. లోక్‌సభలో బీజేపీ ఈ బిల్లు ప్రవేశపెట్టిన రోజు శివసేన మద్దతు పలికింది. బీజేపీ హిందువులు, ముస్లిముల మధ్య ఈ బిల్లు ద్వారా ‘అదృశ్య విభజన’ సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని సోమవారం శివసేన తన అధికారపత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ అదే రోజు ర్టీ పౌరసత్వ బిల్లుపై శివసేన పా యూటర్న్‌ తీసుకుంది. శివసేన ఈ విషయంపై స్పందించిన ఎంపీ అరవింద్‌ సావంత్‌.. ఈ బిల్లుకు దేశ ప్రయోజనాల కోసం తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో మత యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన పార్టీకి.. పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి శివసేన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న మీడియ ప్రశ్నకు.. ‘అది శివసేన పార్టీనే అడగాలి’ అని వివరణ ఇచ్చారు.

Related posts