telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ “హీరో”కు సమస్య

Vijay Devarakonda

పెళ్ళి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ విజయ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత “గీతగోవిందం, టాక్సీవాలా”తో మళ్ళీ తన సత్తా చాటుకున్నాడు. అంతేకాదు యూత్ లో అమాంతం తన క్రేజ్ ను పెంచేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు విజయ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 9గా ఈ సినిమా రూపొందనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు “హీరో” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ప్రకటించింది చిత్రయూనిట్. చిత్రాన్ని ఏప్రిల్ 22 న ఢిల్లీలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన షాలినీ పాండే నటించనుందని టాక్.

అయితే అప్పుడే ఈ చిత్రానికి సమస్యలు ఎదురయ్యాయి. తమిళంలో “హీరో” టైటిల్ తో శివ కార్తికేయన్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా ముందుగానే మొదలైంది. కాబట్టి ఈ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా తమిళ నిర్మాతల మండలిలో “హీరో” టైటిల్ ను తాము రిజిస్టర్ చేసుకున్నట్లుగా వెల్లడించారు. మరిప్పుడు విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో చూడాలి.

Related posts