telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఈవారం .. బలైన .. శివజ్యోతి.. హౌస్ లో విజయ్ దేవరకొండ..

sivajyothi out from bigg boss house

బిగ్‌బాస్‌ 3 తెలుగు లో ఈ వారం షిప్ జ్యోతి ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పటికే రాహుల్‌ సిప్లిగంజ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు టికెట్‌ టు ఫినాలే దక్కించుకుని టాప్‌ 5లో నిలిచారు. మిగతా ముగ్గురిలో ఫైనల్‌కు చేరే వరుణ్ సందేశ్, అలీ రెజా సేఫ్ అయ్యారు. వరుణ్ మాత్రం ఈ నాటి అతిధి అయిన విజయ్ దేవరకొండ ద్వారా సేఫ్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. దీపావళి పర్వదినాన జరిగిన వీకెండ్ కార్యక్రమంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి నటుడు దేవరకొండ విజయ్ అతిథిగా వచ్చి హౌస్ ఉన్న ఆరుగురు కంటెస్టులను ఒక ఆట అడ్డుకున్నారని చెప్పాలి. విజయ్‌ దేవరకొండ బిగ్‌బాస్‌ హౌస్‌లోని కన్ఫెషన్‌ రూమ్‌ కి చేరుకున్నారు. అక్కడి నుంచే ఇంటి సభ్యులకు ఒక్కొక్కరిని ఆశ్చర్యపరిచారు. కన్ఫెషన్‌ రూంలోకి వచ్చిన ప్రతి కాంటెస్టు కూడా విజయ్ ని చూసి సర్‌ప్రైజ్‌ అయ్యారు. జ్యోతక్క ఓ అడుగు ముందు కేసి లడ్డుగైనవ్‌.. అంటూ అతన్ని ఆటపట్టించింది.

వైఫ్‌ లేకుండా ఎలా ఉంటున్నావ్‌ అని విజయ్‌.. వరుణ్‌ను ఆటపట్టించాడు. ఆ ఇద్దరు ఒకే కాలేజీకి చెందివారు కావడం విశేషం. ఆ విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. దానికి స్పందించిన విజయ్ నాకన్నా సీనియర్ వరుణ్ అని కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా అతడి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు ఈ టాలీవుడ్‌ రౌడీ. ఈ సమయంలో నాగ్‌.. విజయ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘నీ పెళ్లి గురించి ఎప్పుడూ రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడిగాడు. దీనికి రౌడీ స్పందిస్తూ ‘ఇంకా తన అమల దొరకలేదు’ అని నాగ్‌కు ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. దీనికి నాగ్‌ బదులిస్తూ ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’నని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్‌ సరదాగా సాగింది.

Related posts