telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

శివబాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌ .. బిగ్ బాస్ చూసే తీరికే లేదట..

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 మరో రెండు వారాల్లో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలనుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందని బిగ్‌బాస్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్‌ చాలా వీక్‌గా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బంధాలు, ఎమోషన్స్‌, ప్రేమవ్యవహారాలతో ఈ సారి షోలో వినోదం తక్కువైందని వాపోతున్నారు. అదేవిధంగా బిగ్‌బాట్‌ టాస్కుల్లో కొత్తదనం లోపించిందని విమర్శిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్ని బిగ్‌బాస్‌ షోలు చూసి రావడంతో ఫిజికల్‌, సీక్రెట్‌ టాస్క్‌లను ముందే అంచనా వేస్తున్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

అభిమానులు ఈ సీజన్‌ను చాలా బోరింగ్‌గా ఫీలవుతున్నామని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఈ వాదనకు మరింత బలం చేకూరేలా బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ విన్నర్‌ శివబాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా సీజన్‌ను చూడటం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దానికి గల కారణాలను కూడా వివరించాడు. తనకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే చాలా ఇష్టమని, అయితే అది ఈ సీజన్‌లో లోపించిందన్నాడు. అందుకే ఈ సీజన్‌ తనకు కనెక్ట్‌ కాలేదన్నాడు. ఆరంభంలో కొన్ని ఎపిసోడ్‌లు చూసినప్పుడే ఈ విషయం పక్కాగా అర్థమైందన్నాడు. ప్రస్తుతం షూటింగ్‌, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్‌ షోను మొత్తానికే చూడటం మానేశానని పేర్కొన్నాడు.

Related posts