telugu navyamedia
Sexual Problems

ఇది సిట్యుయేషనల్ సైకో సెక్సువల్ డిజార్డర్

Participating in sex for seven hours a day .... She is dissatisfied

నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతోంది. నా భార్యకు టీబీ వచ్చింది. అప్పుడు 6 నెలలు హాస్పిటల్‌లోనే ఉంది. ఈ కాలంలో నేను నా భార్య చీరలు కట్టుకుని హస్త ప్రయోగం చేసుకునే వాణ్ణి. నా భార్య డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్‌ని కలిస్తే సెక్స్‌కు 6 నెలలు దూరంగా ఉండాలన్నారు. కొన్నాళ్ళపాటు అలాగే నా కోరిక తీర్చుకున్నాను. డాక్టర్ చెప్పిన 6 నెలలు పూర్తయ్యాక సెక్స్‌లో పాల్గొందామంటే మరో సంవత్సరం ఆగుదామంటోంది. నేనేం చేయాలి? ఇప్పుడు మళ్ళీ చీర కట్టుకుంటే నీకు దయ్యం పట్టింది. అందుకే అలా చేస్తున్నావ్ అంటుంది. నా సమస్యకు పరిష్కారం ?

మీ సమస్యని సిట్యుయేషనల్ సైకో సెక్సువల్ డిజార్డర్ అంటారు. అంటే, పరిస్థితులు కల్పించే లైంగిక సమస్య. మీరు సెక్సాలజిస్ట్ వద్ద మనోలైంగిక చికిత్స తీసుకోండి. మీరు ఆరు నెలలు పాటించిన దూరం చాలు. కండోమ్ వాడుతూ దాంపత్య జీవితాన్ని కొనసాగించండి. చికిత్సవల్ల సాధారణ శృంగార జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మీకేమీ దయ్యం పట్టలేదు. లైంగిక ప్రక్రియలో ఒక కొత్త, అసహజ ప్రవృత్తి మొదలైంది. దీన్ని మొగ్గలోనే తుంచెయ్యడం మంచిది. దంపతులు ఇద్దరూ కలసి కౌన్సెలింగ్ తీసుకోండి.

Related posts

ఒత్తిడిలో సెక్స్ ?

vimala p

మేల్ మెనోపాజ్ ఉంటుందా ?

vimala p

కండోమ్ వాడకం… సూచనలు

ashok