telugu navyamedia
సినిమా వార్తలు

సితార క్యూట్ డ్యాన్స్… వీడియో వైరల్

Mahesh-babu-with-sitara

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోవ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన సితార ఇందులో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అప్పుడ‌ప్పుడు క్యూట్ డ్యాన్స్‌తోను సంద‌డి చేసే సితార తాజాగా “మ‌హ‌ర్షి” చిత్రంలోని “పాల‌పిట్ట‌…” అనే సాంగ్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఈ డ్యాన్స్‌కి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. మీరు డ్యాన్స్ వీడియోపై ఓ లుక్కేయండి.

Related posts