telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వివేకా హత్యపై దర్యాప్తు వేగవంతం.. వివరాలు సేకరిస్తున్న సిట్

SIT Investigation YS viveka Murder

హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. వివేకా హత్యపై రెండు కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వేకా నివాసంలోని బెడ్ రూమ్, బాత్ రూమ్ లను సిట్ అదనపు డీజీ అమిత్ గార్గ్, సిట్ ఇన్ ఛార్జ్ అభిషేక్ మహంతిలు పరిశీలించారు. మరోవైపు వివేకా కుమార్తె సునీత, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల నుంచి సిట్ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.

హత్యకు సంబంధించి ఇప్పటికే నలుగురి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్తి వివాదాలు, అంతర్గత రాజకీయలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. సిట్ అదుపులోకి తీసుకున్న వారిలో వివేకా డ్రైవర్ ప్రసాద్, పీఏ కృష్ణారెడ్డి, ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పనిమనిషి లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘటనాస్థలంలో సాక్ష్యాల ధ్వంసంపై కూడా పోలీసుల విచారిస్తున్నారు.

Related posts