telugu navyamedia
సినిమా వార్తలు

ట్విస్ట్ : డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు

1000 Crores Ddrugs seized Bomba

రెండేళ్ల క్రితం టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరికి డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సిట్ చార్జీషీట్ దాఖలు చేసింది. అప్పట్లో ఈ కేసు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. దీనిపై అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు.

అయితే చార్జిషీట్లలో సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్‌ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ముంబై నుండి రఫెల్ అలెక్స్ అనే వ్యక్తి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్టుగా చార్జీషీట్‌లో సిట్ పేర్కొంది.ఈ కేసులో కొందరు సినీ ప్రముఖుల నుండి సిట్ బృందం వెంట్రుకలు, చేతి వేళ్ల నమూనాలను కూడ తీసుకొన్నారు. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్‌ నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చారనే వార్తను ఎక్సైజ్ శాఖ కొట్టిపారేసింది. ఈ కేసులో మరికొన్ని చార్జీషీట్లు దాఖలు చేస్తామని తేల్చి చెప్పింది.

ఈ విషయమై తీవ్రమైన విమర్శలను ఎక్సైజ్ శాఖ మూటగట్టుకొంది. ఈ తరుణంలో ఎక్సైజ్ శాఖ బుధవారం నాడు వివరణ ఇచ్చింది. తమపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడు చార్జీషీట్లు, మరో ఐదు చార్జీషీట్లు దాఖలు చేయనున్నట్టు సిట్ అధికారులు ప్రకటించారు. సినీ ప్రముఖులకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పింది. సినీ ప్రముఖుల నుండి సేకరించిన శాంపిళ్లకు సంబంధించిన ఎవిడెన్స్‌ను పోరెన్సిక్ నుండి వచ్చిందని సిట్ ప్రకటించింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నవారెవరినీ కూడ తాము వదలబోమని సిట్ హెచ్చరించింది.

Related posts