telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీజ మాజీ భర్త మరో వివాహం ?

Sirish-Bharadwaj

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో శిరీష్ భరద్వాజ్ నుండి శ్రీజ విడిపోయి ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ ని 2016 మార్చి 28న పెళ్ళి చేసుకుంది. శిరీష్, శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరివురు విడిపోయిన త‌ర్వాత పాప శ్రీజ ద‌గ్గ‌రే ఉంటుంది. శ్రీజ తో విడిపోయాక శిరీష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజెపి పార్టిలో చేరాడు. అయితే శ్రీజ మాజీ భర్త శిరీష్ కూడా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి రెడీ అవుతున్నాడని కొద్ది రోజులుగా సోష‌ల్‌ మీడియా లో వార్తలు వస్తున్నాయి. శిరీష్ సోష‌ల్ మీడియా ఎకౌంట్‌లో ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఆమె శిరీష్ భార్య‌నే అయి ఉంటుంద‌ని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related posts