telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చీరలకు సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ కావాలి: కేటీఆర్

ktr trs president

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికుల కోసం పలు హామీలు గుప్పించారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో నేతన్నలకు గౌరవం దక్కేలా చర్యలు చేపడుతామని అన్నారు.

చేనేత కార్మికుల చేయూత కోసం భద్రతతో కూడిన జీవనోపాధి కల్పించనున్నట్లు తెలిపారు. 11 వేల మంది చేనేత కార్మికులకు రుణమాఫీ నుంచి విముక్తి కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో రూ.40.50 కోట్ల మీటర్ల వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ ఆర్డర్ వల్ల నెలపాటు నేతన్నలకు ఉపాధి లభించిందని స్పష్టం చేశారు. సిరిసిల్ల చీరలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts