telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

డయాబెటీస్ కు .. అదే సరైన మందు..

single fine step to control diabetics

డయాబెటీస్ ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య. మన మధ్య ఎంతోమంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతూ ఉంటారు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎవరైనా డయాబెటీస్‌ సమస్యతో పాటు సన్నగా ఉన్నట్టయితే పెద్దగా బాధపడే అవసరం లేదు. ఇలాంటి వారు కఠిన నియామాల వంటివి పాటించనవసరం లేదని కూడా సలహా ఇస్తున్నారు. డయాబెటీస్‌లో టైప్ 2 డయాబెటీస్‌తో బాధపడుతున్నవారిలో వ్యాధి వచ్చిన 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో సుమారు 10 కిలోలు బరువు తగ్గినట్టయితే ఇది శుభ పరిణామమే. ఎందుకంటే ఊబకాయంతోనే అధికంగా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అందువల్ల సహజంగానే బరువు తగ్గితే అది మంచిదేనంటున్నారు వైద్యులు

ఎప్పడైనా సరే డయాబెటీస్ ఉన్నవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరమో అంతే ఆహారాన్ని భుజించడం, ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేయడం. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ తగ్గుతుందంటున్నారు. టైప్ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 400 మిలియన్ల మంది ఉంటే వీరిలో అత్యధికులు గుండె జబ్బులు, పక్షవాతం, అంధత్వం వంటి అదనపు సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం సరైన మందులు వాడకపోవడం, సరైన నియమాలు పాటించకపోవడం. ఆ కారణాలే వారిని పలు అనారోగ్య సమస్యలకు నడిపిస్తున్నాయి. వీటిని రాకుండా చేయాలంటే మందుగా డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.

Related posts