telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

26న సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ…

సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి సర్వ సాధారణం. అయితే తాజాగా… సింగర్ సునీత కూడా కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగింది. అనంతరం ఆమె పెళ్లి చేసుకుంటున్నానని అధికారికంగా ప్రకటించింది. ఇక ముందు ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పటికీ సరయిన క్లారిటీ లేదు. అయితే ఆ విషయం మీద క్లారితే ఇవ్వని సునీత తన ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసింది. ఈ నెల 26 న గచ్చిబౌలిలోని ఒక రెస్టారెంట్ లో ప్రీ వెడ్డింగ్ వారి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీకి చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఈ ఇన్విటేషన్ అందింది. ఇక మొన్న కూడా ఒక ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. కాకపోతే అది నితిన్ ఆర్గనైజ్ చేయగా ఇప్పుడు జరుగుతున్నది కాబోయే జంట ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పుడు చేసుకుంటారు వీరి వివాహం అనేది.

Related posts