telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాప్ సింగర్ స్మితకు అరుదైన గౌరవం

Smitha

తెలుగు పాప్ సింగర్ స్మిత తన పాప్ గీతాల ప్రస్థానంలో అప్పుడే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రెండు దశాబ్ధాల ప్రస్థానాన్ని తాజాగా హైదరాబాద్ మీడియాతో షేర్ చేసుకుని సంతోషం వ్యక్తం చేసింది స్మిత. 20 ఏళ్లు పూర్తయినా ఈ రోజు నుంచే నా ఎక్సైటింగ్ జర్నీ మొదలవుతోందన్న ఫీలింగ్ లో వున్నాను. అప్పుడే నేను కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్లు పూర్తయిందా? అనే షాక్ లో వున్నాను. ఇంత కాలం నాకు సపోర్ట్ గా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. ఇకపై నా జర్నీకి సపోర్ట్ గా నిలిస్తే ఆ ప్రోత్సాహాన్ని మంచి పనులకు వాడాలనుకుంటున్నాను. అంతా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 22న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమానికి నాగార్జున గారు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. ఆయన నాకు ఓ మెంటర్ లాంటి వారు. ఎప్పుడూ అందరి కన్నా అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తుంటారాయన. ఆయన రాకపోతే ఈ కార్యక్రమం చేయనని చెప్పాను. ఆ కెరీర్ ని బాగా ఎంకరేజ్ చేసింది ఆయనే. తొలి బిజినెస్ ఆల్బమ్ సన్నజాజీ పడకా మాహివే. వంటి పాపులర్ ఆల్బమ్స్ ని.. నా మ్యూజిక్ స్కూల్ ని లాంచ్ చేసింది కూడా ఆయనే కావడంతో ఆయనే రావాలని చెప్పాను. నాని- కీరవాణి- జగపతిబాబు వంటి ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని స్మిత మీడియాకు వెల్లడించారు.

1998లో హాలీవుడ్ పాప్ దిగ్గజం బ్రిట్నీస్పీయర్స్ తొలి పాప్ ఆల్బమ్ విడుదలై సంచలనం సృష్టించింది. సరిగ్గా ఏడాది తర్వాత 1999లో స్మిత “హయ్ రబ్బా…” తెలుగు ప్రేక్షకులకు పాప్-తెలుగు గీతాన్ని పరిచయం చేసింది. ఈ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. తొలి ఆల్బమ్ హిట్ తరువాత తెలుగు పాప్ రంగంలో ఎంతో క్రేజీ తారగా ఎదిగింది. సినిమాల్లో నటించేంత వున్నా ఆ వైపు వెళ్లడానికి ఇష్టడని స్మిత తన పాప్ గీతాల ప్రస్థానంలో అప్పుడే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే క్లాసిక్ రీమిక్సులతోనూ ఆకట్టుకుంది. `మసక మసక చీకటిలో..` అంటూ తొలి రీమిక్స్ ని పరిచయం చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది స్మిత. తెలుగుతోనే తన ప్రయోగాలని ఆపకుండా తమిళాన్ని కూడా టచ్ చేసింది. అక్కడ స్మిత చేసిన తొలి పాప్ ఆల్బమ్ `కలక్కల్`. ఇది అక్కడి యువతను ఓ రేంజ్ లో హుషారెత్తించింది. `అనుకోకుండా ఒక రోజు` సినిమా కోసం ఆబ్లిగేషన్ కారణంగా `ఎవరైనా చూసుంటారా` అనే పాటని పాడి ఆకట్టుకుంది. స్మిత పాడిన ఆ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఒక భారతీయ పాప్ సింగర్ పాడిన ఆల్బమ్ ని సోనీ బిఎజీ విడుదల చేసిన దాఖలాలు లేవు. కానీ ఆ ఘనతను స్మిత దక్కించుకుంది.

Related posts