telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్ సింప్లిగంజ్ గుండు లుక్… ఆ హీరోయిన్ కోసమేనట…!

Rahul-Simpligunj

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాహుల్.. గుండుతో కనిపించడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ లుక్ షేర్ చేసిన ఆయన.. ‘ఇది గుండుతో హల్చల్ చేయాల్సిన సమయం’ అని ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో రోల్ కోసం రాహుల్ లుక్ మార్చేశాడని టాక్. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో శివాత్మిక జోడీగా రాహుల్ నటిస్తున్నాడు. రాహుల్ గుండు వెనుక ఆమె పాత్ర ప్రభావం ఉంటుందని, వీళ్లిద్దరి క్యారెక్టర్స్ సినిమాకే పెద్ద అసెట్ అవుతాయని తెలుస్తోంది. మొత్తానికైతే రాహుల్ గుండు లుక్, ఆ రహస్యం టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం కావడం విశేషం. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. అంచెలంచెలుగా తన పాపులారిటీ పెంచుకున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఒక్కరికీ సుపరిచితం అయ్యాడు. ఈ షోలో తోటి పార్టిసిపెంట్ పునర్నవి భూపాలంతో ఆయన పండించిన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ కూడా బటయకొచ్చాయి. ఇంకా ఎన్నో విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు రాహుల్.

 

View this post on Instagram

 

It’s time for GUNDU now! 🙈

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

Related posts