వార్తలు సామాజిక సినిమా వార్తలు

సినారె గజల్…

sinare gajals
తెలుగు సాహితీ జగాన జ్ఞానశిఖరం ఎప్పటికీ
గజల్ రసజగత్తులో రారాజు సినారె ఎప్పటికీ
 
మదినిదోచే మైమరపు మధురగేయాల మకరందం
అక్షరాలను పరిమళింపజేసిన రసరాజు ఎప్పటికీ
 
కవితలపూలు పూయించిన సాహితీ వనమాలి
తెలుగు సాహితీ పూదోటలో కవిరాజు ఎప్పటికీ
 
నూతన పదాలను ఆవిష్కరించిన నిత్యప్రయోగశీలి
సాహిత్యానికే వన్నె తెచ్చిన సారస్వతజీవి ఎప్పటికీ
 
కమ్మనైన కవితలను పసందు చేసిన ప్రతిభాశాలి
కావ్యాలను గుభాళింపజేసిన కావ్యరాజు ఎప్పటికీ
 
అక్షరదీపాలను వెలిగించిన జ్ఞానపీఠ విశ్వంభరుడు
తెలుగుభాష ఘనతను చాటిన విశ్వకవి ఎప్పటికీ
 
తెలుగు సినీజగత్తును ఏలిన పల్లవుల చెలికాడు
ఆధునికతను వెలిగించిన చిరయశస్వి ఎప్పటికీ
 
                                     – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
 

Related posts

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వస్తోన్న భారీ చిత్రం ‘కె.జి.ఎఫ్‌’ ఫస్ట్‌లుక్‌…

chandra sekkhar

దమ్ముంటే పోరాడాలి కానీ నాపై ఇలా రాళ్లదాడి చేయడం ఏంటి… ముఖ్యమంత్రి

nagaraj chanti

కిడాంబి శ్రీకాంత్ కు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సత్కారం

admin

Leave a Comment