telugu navyamedia
culture

ఈ రైలు ఎక్కితే.. బయటి అందాలను తనివితీరా వీక్షించవచ్చు 

simla train
శిమ్లా: వడోదర‌కు చెందిన ఒక కంపెనీ డిజైన్ చేసిన విస్టాడోమ్ కోచ్‌లో కూర్చుని కాల్కా నుంచి శిమ్లా వెళ్లే యాత్రికులు అద్భుతమైన ఆనందాన్ని అందుకోవచ్చు. ఈ కోచ్ మొత్తాన్ని గ్లాస్‌తో రూపొందించడంతో బయటి ప్రకృతి అందాలను తనివితీరా వీక్షించవచ్చు. హిందుస్థాన్ ఫైబర్ గ్లాస్‌వర్క్స్ ఈ ప్రత్యేకమైన కోచ్ రూపొందించింది. ఎల్ఈడీ లైట్, జీపీఎస్ సిస్టమ్, అబ్జర్వేషన్ లాంజ్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఈ కోచ్‌లో ఉన్నాయి. కాల్కా నుంచి సిమ్లా మధ్య 92 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌పై ఈ రైలు నడుస్తుంది. ప్రస్తుతానికి ఇలాంటి ఒక కోచ్ మాత్రమే ట్రైన్‌కు అనుసంధానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లలో ఇటువంటి కోచ్‌లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

Related posts

మహిళల కోసం తరుణి మెట్రో స్టేషన్‌..

vimala p

కొత్త సంవత్సరం మొదటి రోజు మీ జాతక ఫలితాలు చూడండి…

ashok

వీటితో.. వైరల్ ఫీవర్ కు చెక్..

vimala p