telugu navyamedia
సినిమా వార్తలు

“భారతీయుడు”కు మనవడిగా శింబు 

Shankar-and-kamal-Hassan
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా శింబు ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడనేది తాజా సమాచారం.
ఈ సినిమాలో కమల్ హాసన్ కు మనవడిగా శింబు కన్పించబోతున్నాడని సమాచారం. గతంలో వచ్చిన “భారతీయుడు” సినిమాలో కమల్ సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్ గా ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు సేనాపతికి మనవడిగా శింబు కన్పించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  శింబు పాత్ర సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం శంకర్ 8 దేశాల్లో లొకేషన్లను ఎంపిక చేసుకున్నాడు.

Related posts