telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో శింబుకు అదిరిపోయే సర్‌ప్రైజ్..

హీరో శింబు ఏ సమస్య వచ్చినా దాన్ని సవాలుగా తీసుకుని.. పరిష్కార మార్గాలు అన్వేషిస్తాడు. ఇటు వర్క్‌ విషయంలోనూ శింబు డెడికేషన్‌ గురించి చెప్పనక్కర్లేదు. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా వర్కవుట్స్‌ చేసి 101 కేజీల నుంచి 71 కేజీల వరకు తగ్గిపోయాడట. తనలోని మార్పు తనకే షాకిచ్చిందని అంటున్నాడు శింబు. త్వరలో ఈశ్వరుడు అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్న శింబు…నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ సుశీంద్రన్‌ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపథ్యంలో సినిమా చేయనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. కొన్ని నెలలుగా శింబు పడుతున్న కష్టం, వర్క్‌పై ఆయనకున్న అంకిత భావాన్ని చూసి మురిసిపోయిన శింబు తల్లి బ్రిటీష్‌ రేసింగ్‌ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు. ఇది శింబు డ్రీమ్‌ కారని.. దీని ధర రూ. 50 లక్షలని సమాచారం. తల్లి ఇచ్చిన గిఫ్ట్‌కు శింబు తెగ సంతోషించాడట. శింబు ఇటీవల ఈశ్వరన్‌ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు.

Related posts