telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పెరిగిన వెండి ధర…

gold-biscuits hyd

ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడం అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధనత్రయోదశి పండగలు బంగారం కొనుగోళ్లు పెరిగాయి.  నిన్నటి రోజున బంగారం ధర రూ.100 పెరిగింది.  అయితే, ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.  బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ, అటు వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 53,620 కి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 49, 250 వద్ద ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 వద్ద ఉంది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 51,490 స్థిరంగా ఉంది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ.63,300కి చేరింది.  పరిశ్రమల యూనిట్లు, నాణెపు తయారీ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతోనే ఈ రేట్లు అని అంటున్నారు విశ్లేషకులు.

Related posts