Trending Today రివ్యూలు సమీక్ష వార్తలు సినిమా వార్తలు

“సిల్లీ ఫెలోస్” మా వ్యూ

బ్యానర్ : బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ
దర్శకుడు : భీమినేని శ్రీనివాసరావు
నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
సంగీతం : శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ : అనిష్ తరుణ్ కుమార్

అల్లరి నరేష్, సునీల్ ఇద్దరూ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. అయితే కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. రెండు మూడు సినిమాలు బాగానే ఆడినప్పటికీ మళ్ళీ వరుసగా పరాజయాలు పలకరించారు. దీంతో ప్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరు కామెడీ స్టార్లు కలిసి “సిల్లీ ఫెలోస్” చిత్రాన్ని చేశారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్టుగా పిలుచుకునే దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మరోసారి తమిళ రీమేక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. “ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ” అంటూ చిత్రటీం మొత్తం ఎంతో నమ్మకంతో చెప్పడం, ట్రైలర్ కూడా కొత్తగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. మరి అల్లరి నరేష్, సునీల్ “సిల్లీ ఫెలోస్”గా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకున్నారో చూద్దాం.

కథ :
సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రామ్ (జయప్రకాశ్ రెడ్డి). అతని అనుచరులు వీరబాబు (అల్లరి నరేష్), సూరి బాబు (సునీల్). వీరబాబు ఓ కార్యక్రమంలో జాకెట్ పరువును కాపాడడం కోసం సూరిబాబును రికార్డింగ్ డ్యాన్సులు చేసే పుష్ప (బిగ్ బాస్ ఫేమ్ నందిని)కి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ) అనే అమ్మాయితో పెళ్లి కుదరడంతో పుష్పను వదిలించుకోవాలని చూస్తాడు. అందుకోసం ఎమ్మెల్యే జాకెట్ జానకిని ఆశ్రయించాలని అనుకుంటాడు. అదే సమయంలో వీరబాబు తాను ప్రేమించిన వాసంతి (చిత్రశుక్ల) ఉద్యోగం కోసం జాకెట్ కు 10 లక్షల రూపాయలు ఇస్తాడు.

ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే జాకెట్ జానకి మినిస్టర్ గోవర్ధన్ ను పరామర్శించడానికి వెళ్తాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్ల రహస్యాన్ని జాకెట్ కు చెప్తాడు. తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదానికి గురవుతాడు జాకెట్ జానకి. ఆ రహస్యం కోసం భూతం (పోసాని కృష్ణమురళీ) జాకెట్ వెంటపడతాడు. మరి వీరబాబు, సూరిబాబుల సమస్యలు తీరేనా ? జాకెట్ జానకికి తిరిగి అంతా గుర్తొస్తుందా ? ఆ 500 కోట్ల రహస్యం బయటపడుతుందా ? అన్నది వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
కామెడీ స్టార్ నరేష్ తన ఇమేజ్ కు తగ్గ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. నటన పరంగా నరేష్ ఆకట్టుకున్నప్పటికీ కథలో మాత్రం కొత్తదనం లేదు. రొటీన్ స్టోరీనే. కానీ వీరబాబు పాత్రతో నరేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక కమెడియన్ గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సునీల్ తనదైన శైలిలో నటిస్తూ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ శుక్లా… వాసంతి పాత్రలో… యాక్షన్ సీన్లతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించి ఫరవాలేదన్పించారు. మరో కీలకపాత్రలో నటించిన నందిని రాయ్ ప్రేక్షకులను నిరాశనే మిగులుస్తుంది. పూర్ణ అతిథి పాత్రలో మెరిసింది. జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ, రాజా రవీంద్ర తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు మరోసారి రీమేక్ కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళంలో విజయం సాధించిన “వెలైను వంధుట్ట వెల్లకారన్‌” అనే చిత్రాన్ని తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కానీ ఇలాంటి చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. దీంతో ప్రేక్షకులు రొటీన్ గా ఫీలవ్వచ్చు. ప్రథమార్థం ఫరవాలేదు… ద్వితీయార్థం సినిమాను మైనస్. హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. శ్రీవసంత్ సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts

షారుఖ్ ను కొట్టిన లేడీ కొరియోగ్రాఫర్… !?

vimala t

"మా" ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

admin

జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

admin

Leave a Comment