telugu navyamedia
సినిమా వార్తలు

“సైలెంట్”గా అనుష్క మూవీ షూటింగ్ స్టార్ట్

Anushka

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “సైలెన్స్”. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో తెరకెక్కనుంది. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తుంది. ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. తొలి రోజు తొలి షాట్‌ని చిత్రీక‌రించిన‌ట్టు ద‌ర్శ‌కుడు హేమంత్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. రామోజీ ఫిలిం సిటీలో తొలి షెడ్యూల్ తెరకెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆ త‌ర్వాత అమెరికాకి ప‌య‌నం కానుంది చిత్ర బృందం. తెలుగులో ఈ చిత్రానికి “నిశ్శబ్దం” అనే టైటిల్ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

Related posts