telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నిశ్శబ్దం” విడుదల తేదీ ఖరారు

Silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై కూడా జ‌నాల‌లో ఆస‌క్తి క‌లిగేందుకు చిత్రంలోని పాత్ర‌ల‌ని ఒక్కొక్క‌టిగా రివీల్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న‌ అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా “నిశ్శబ్ధం” సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

Related posts