telugu navyamedia
సినిమా వార్తలు

“సైలెన్స్”గా అనుష్క ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఖరారు

Anushka

“భాగ‌మ‌తి” చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం “సైలెన్స్‌”. ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తెలుగులో ఈ చిత్రం “నిశ‌బ్ధం” పేరుతో విడుద‌ల కానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌ల అనుష్క ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న లుక్‌ని కొద్దిగా రివీల్ చేసిన విష‌యం విదిత‌మే. పూర్తి లుక్‌ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని పేర్కొంది. ప్రీ లుక్‌లో అనుష్క షార్ట్ హెయిర్‌తో చేతిలో బుక్ ప‌ట్టుకొని రాస్తున్న‌ట్టుగా కనిపిస్తుంది. అయితే తాజాగా మేకర్స్ జూలై 21న చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంలో అనుష్క లుక్ ఎలా ఉండబోతుందా ? అనే ఆసక్తి మొదలైంది.

Related posts