telugu navyamedia
సినిమా వార్తలు

సైమా అవార్డ్స్ 2021: ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు

సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అవార్డ్స్‌ లో సౌత్‌ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకను ఈసారి హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో నగరంలో ఈ వేడుక జరగనున్నాయి. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్‌ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సీనియర్ నటుడు మురళీమోహన్, యువ నటుడు కార్తికేయ, సీనియర్ నటి జీవిత తదితరులు సైమా వేడుకలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో 2019, 2021లో విడుదలైన చిత్రాలకు తాజా కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తున్నారు.


* మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రానికి పురస్కారాల పంట పండింది. ఇందులో నటనకిగానూ ఉత్తమ నటుడిగా మహేష్‌బాబు. ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్‌, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ గేయ రచయితగా శ్రీమణి పురస్కారాలు అందుకున్నారు.

* ఉత్తమ నటిగా సమంత (ఓ బేబి), ఉత్తమ సహాయ నటిగా లక్ష్మి (ఓ బేబి) విజేతలుగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘ఎఫ్‌2’ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి.

* క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటుడిగా నాని (జెర్సీ), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (డియర్‌ కామ్రేడ్‌), ఉత్తమ ప్రతినాయకుడిగా కార్తికేయ (గ్యాంగ్‌లీడర్‌), ఉత్తమ హాస్యనటుడిగా అజయ్‌ ఘోష్‌ (రాజుగారి గది3), ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాన్ని ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రాలకిగానూ నాని, ‘ఎఫ్‌2’ చిత్రానికిగానూ అనిల్‌ రావిపూడి పురస్కారాల్ని అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సానూ వర్గీస్‌(జెర్సీ) నిలిచారు.

* ఉత్తమ తొలి చిత్ర నిర్మాణ సంస్థగా స్టూడియో 99 (మల్లేశం), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఆర్‌.ఎస్‌.జె.స్వరూప్‌ (ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా శ్రీసింహా (మత్తు వదలరా), ఉత్తమ తొలి చిత్ర నటిగా శివాత్మిక రాజశేఖర్‌ (దొరసాని) పురస్కారాలు అందుకున్నారు.

* ‘మజిలీ’ చిత్రంలోని ‘ప్రియతమా ప్రియతమా’ పాటకిగానూ ఉత్తమ గాయనిగా చిన్మయి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టైటిల్‌ పాటకి ఉత్తమ గాయకుడిగా అనురాగ్‌ కులకర్ణి విజేతలుగా నిలిచారు.

* శ్రుతిహాసన్‌, సందీప్‌కిషన్‌, రక్షిత్‌ శెట్టి తదితర దక్షిణాది చిత్ర పరిశ్రమకి చెందిన తారలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌, సుమలత, జీవిత, సుహాసిని మణిరత్నం, షీలా, మీనా, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts