• Home
  • Trending Today
  • హీరో సిద్ధార్థకు బెదిరింపులు
Trending Today సినిమా వార్తలు

హీరో సిద్ధార్థకు బెదిరింపులు

siddharth

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం ఎంత దుమారం లేచిందంటే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో కొందరికి ముచ్చెమటలు పట్టించింది… అదే రీతిలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం చెలరేగిపోతుంది… మొదట హాలీవుడ్ లో పుట్టిన మీటూ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లను తాకింది… ప్రముఖ రచయిత, లఘు చిత్రాల దర్శకురాలు లీనా మణిమేగలై, తిరుట్టుపయలే, కందసామి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరక్టర్ సుశీ గణేషన్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో లీనాకి మద్దతిస్తూ హీరో సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశాడు. దీంతో సిద్ధార్థ్ కి బెదిరింపులు మొదలయ్యాయని ఆయనే స్వయంగా వెల్లడించారు. “నా తండ్రికి సుశీ గణేశన్ ఫోన్ చేసి బెదిరించాడు. లీనాకి మద్దతుగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన గురించి అందరూ తెలుసుకోవాలి. ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే… నేను లీనాకు మద్దతుగానే ఉంటాను” అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

Related posts

తెలంగాణను పీడిస్తున్నది.. ఆ నలుగురు రాక్షసులే.. : ఖుష్బూ

chandra sekkhar

దాడి అనంతరం.. జగన్ మొదటి స్పందన… త్వరలో ..

chandra sekkhar

“దేవదాస్” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా ?

vimala t

Leave a Comment