telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ స్టార్ హీరో ముద్దుపెట్టుకున్నాడు… రొమాన్స్ జరిగింది…!

Ranveer

బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గల్లీ బాయ్’. జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రలో నటించారు. ఆలియా భట్ కథానాయికగా నటించారు. ముంబయికి చెందిన నవేద్ షేక్, వివియన్ ఫెర్నాండెజ్ అనే ఇద్దరు లోకల్ ర్యాపర్స్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద సినిమా కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్స్‌కి కూడా నామినేట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలైన రోజున తనకు రణ్‌వీర్ సింగ్‌కు మధ్య జరిగిన ఓ సంఘటన గురించి సిద్ధాంత్.. నటి నేహా ధుపియా హోస్ట్ చేస్తున్న ‘నో ఫిల్టర్’ అనే షోలో వెల్లడించారు. “ముంబయిలోని జుహు వద్ద ఉన్న పీవీఆర్‌లో గల్లీ బాయ్ విడుదలైనప్పుడు నేను ఉద్వేగానికి లోనయ్యాను. నేను నటించిన మొదటి సినిమా చూసి అందరూ నన్ను ఇంతగా ఆదరిస్తారని నేను అనుకోలేదు. ఆ రోజు కారులో నేను, రణ్‌వీర్ సింగ్ ఉన్నాం. నేను ఏడుస్తుంటే రణ్‌వీర్ నన్ను ఓదార్చాడు. ఆ క్రమంలో నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజు మా మధ్య చిన్న రొమాన్స్ జరిగింది” అని వెల్లడించారు. ఈ మాట వినగానే నేహా షాకైంది. “కొంపతీసి సెక్స్ లాంటిది జరగలేదు కదా…” అని ప్రశ్నించింది. ఇందుకు సిద్ధాంత్ స్పందిస్తూ “ఛీ అలాంటిది ఏమీ లేదు. నన్ను ఓదార్చడానికి రణ్‌వీర్ నన్ను ముద్దుపెట్టుకున్నాడంతే” అని తెలిపాడు. ఆయన నటించిన మొదటి సినిమా ఏకంగా ఆస్కార్‌కు నామినేట్ కావడం విశేషం.

Related posts