telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారతీయుడు2 లో.. విలన్ గా .. సిద్దార్ధ్.. త్వరలో ఫస్ట్ లుక్.. !

siddardh as villan in indian 2 movie

1996 లో శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత వెంటనే రెండో పార్టీ చేయాలనీ అనుకున్నారు కానీ కుదరలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆ పార్ట్ కుదిరింది. ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ తాజాగా మొదలు అయ్యింది. చెన్నై శివార్లలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు. ఈ సినిమా సెట్స్ పీకి వెళ్లకవుందే కమల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శంకర్..తాజాగా చిత్రం లో నటిస్తున్న మరో వ్యక్తి తాలూకా లుక్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యాడట.

భారతీయుడులో కమల్ హాసన్ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపిస్తే, సిద్దార్థ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ పాత్ర కూడా మేకప్ పరంగా చాలా విలక్షణంగా ఉండబోతోందట. ఆ పాత్రకు సంబంధించిన లుక్ నే త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.

ఏడాది చివరినాటికి విడుదల చేయాలనేది ప్లాన్.

Related posts