telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా ఓటమికి కారణాలు .. చెప్పేసిన సిద్ద..

Siddaramaiah comments sadvi

కర్ణాటక ఉప​ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించి, అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా మారి.. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్‌ అగమ్యగోచరంలో పడింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక లో బీజేపీ హవాను అడ్డుకుంటామని ఆశపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి సోమవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జేడీఎస్‌తో పొత్తు, కూటమిలో అంతర్గత విభేదాలు, కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్ కార్యచరణలపై స్పష్టత లేకపోడం; బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఆరు సీట్లు అవసరమయితే.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని రాబట్టడానికి 12 స్థానాల్లో గెలవాల్సి రావడం; మాజీ సీఎం సిద్ధరామయ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వ పనితీరును గతంలో గట్టిగా విమర్శించడం; కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జీ కేసీ వేణుగోపాల్ ఉప ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనకపోవడం; కాంగ్రెస్‌ పార్టీకి దిశానిర్దేశం చేసే సరియైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటను అడ్డుకట్ట వేయకపోవడం; ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలంటే.. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి; కర్ణాటక ప్రాజ్ఞవ్యంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైన అనర్హత ఎమ్మెల్యే ఆర్‌. శంకర్‌కు.. ఉప​ ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి టికెట్‌ దక్కకపపోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణ్‌ కుమార్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు; అసెంబ్లీకి ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, చట్టసభ సభ్యుడిని ప్రభుత్వం నామినేట్ చేయడం లాంటివి ప్రధాన కారణాలుగా చెపుతున్నారు. కర్ణాటక మాజీ స్పీకర్‌ కేఆర్‌ రమేష్‌ 17 మంది ఎమ్మెల్యేలను (శాసనసభ్యులు) అనర్హులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ వారిని ఉప ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు కల్పించడంతో.. ఓటర్లు పార్టీలకతీతంగా అభ్యర్థి వైపు మొగ్గుచూపరనే విషయాన్ని గమనించాలి.

Related posts