telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“శ్యామ్ సింగరాయ్” నుంచి అదిరిపోయే అప్డేట్‌

Nani

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే నేని చేస్తున్న సినిమాలలో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాక్సీవాల దర్శకుడు రాహుల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అల్యుమినియం ఫ్యాక్టరీల్లో చేశారు. ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్ కోసం కోల్‌కతా వెళ్లారంట. అక్కడ నాని, సాయి పల్లవి మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంట. ఇందులో ఇతర కీలక నటులు కూడా పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని పుట్టిన రోజు సందర్భంగా అప్‌డేట్ ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే నాని… తన ఫ్యాన్స్‌కు ఇవాళ ఓ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. అందరూ ఊహించినట్లుగానే ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను తన బర్త్‌డే గిఫ్ట్‌గా రిలీజ్‌ చేస్తున్నాట్టు నాని ట్వీట్‌ చేశాడు. ఫిబ్రవరి 24న శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ రాబోతుంది అంటూ ఓ వీడియోను ట్విట్టర్‌లో నాని పోస్ట్‌ చేశాడు. దీంతో నాని ఫ్యాన్స్‌లో ఊత్సాహం మొదలైంది.

Related posts