telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదిరిపోయిన “శ్యామ్ సింగరాయ్” ఫస్ట్‌లుక్

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. అయితే నేని చేస్తున్న సినిమాలలో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాక్సీవాల దర్శకుడు రాహుల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అల్యుమినియం ఫ్యాక్టరీల్లో చేశారు. తన అభిమానులకి శ్యామ్ సింగరాయ్ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఈ ఫస్ట్‌లుక్ చెప్పినట్లు చెప్పిన సమయానికి విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను నాని తన ట్వీటర్ ద్వారా విడుదల చేశారు. పేరు శ్యామ్ పూర్తి పేరు శ్యామ్ సింగరాయ్ అంటూ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నాని జేబుల్లో చేతులు పెట్టుకొని నించొని ఉంటే వెనుక నుంచి హీరోయిన్ కౌగిలించుకొని ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తుంది. 

Related posts