telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భార్గవ దర్శకత్వంలో మైథలాజికల్  సోషల్ కామెడీ చిత్రం  “శూర్పణఖ “

shurpanaka in bhargava direction
తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం “కిట్టు ” (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత  భార్గవ దర్శకత్వంలో  “శూర్పణఖ ” పేరుతో ఒక చిత్రం రూపొందనుంది.  భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ, D.R రెడ్డి సంయుక్తంగా  నిర్మించనున్నారు.  ఈ సందర్భంగా  రచయిత, దర్శకుడు భార్గవ మాట్లాడుతూ  ”మైథలాజికల్  సోషల్ కామెడీ చిత్రం ఇది.  రామాయణంలో కీలకమైన మలుపులు  శూర్పణఖ వల్లనే  సంభవించాయి.
శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలో కి  వస్తే  పరిణామాలు ఎలా ఉంటాయి అనే  కధాంశం తో ఈ చిత్రం రూపొందుతుంది. అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది ? అసలు వచ్చి  ఏం చేసింది ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే! శూర్పణఖ ఏ విధంగా  అప్పటి లంకను, ఇప్పటి సమాజంతో, అలాగే  అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథ గా అల్లడం జరిగింది” అని తెలిపారు. 
చిత్ర నిర్మాతలలో  ఒకరైన D.R  రెడ్డి  మాట్లాడుతూ ”శూర్పణఖ పాత్ర ని ఒక ప్రముఖ నటి చేయబోతుంది. ఆ  వివరాలు మరియు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఈ చిత్రం లో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన  ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం. వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది ” అని   తెలిపారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, కథనం, దర్శకత్వము – భార్గవ. నిర్మాతలు: భార్గవ, D.R  రెడ్డి, బ్యానర్స్ : భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్  

Related posts