telugu navyamedia
సినిమా వార్తలు

నిర్ణయం నాదే… తప్పయితే అనుభవం వస్తుంది కదా.. శృతి హాసన్

Shruti-Haasan

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి పేరే బ‌లంగా విన‌ప‌డుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రుతి హాస‌న్ అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ “టెడ్‌స్టోన్‌”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న “ట్రెడ్ స్టోన్‌”ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న శృతికి “మీకు ఎలాంటి విషయాల్లో ఇతరుల సలహాలు అవసరం అవుతుంటాయి ?” అనే ప్రశ్న ఎదురైంది మీడియా నుంచి… ఈ ప్రశ్నపై స్పందించిన శృతి మాట్లాడుతూ… “అమ్మానాన్నలు నన్ను స్వతంత్ర భావాలతో పెంచారు. దీంతో నాకు ఏ విషయంలోనైనా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అయింది. అలా అలవాటు అవ్వడం వలన.. ఎవరినీ సలహాలు అడిగే అవసరమే రాలేదు. అయితే నేను తీసుకొనే నిర్ణయాలు అన్నీ సరైన నిర్ణయాలే అని కాదు. అలానే ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పైనా.. మరొకరిని ఆ విషయంలో నిందించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా దానివల్ల వ్యక్తిగతంగా కూడా అనుభవం వస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాల.. ఒకవేళ మంచి జరిగినా అది మనం సొంతంగా సాధించామనే తృప్తి కలుగుతుంది” అని చెప్పుకొచ్చింది శృతి.

Related posts