telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సలార్ లో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్…

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ పూర్తయ్యేసరికి మరో సినిమాను పట్టాలెక్కించాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాల్లో చేయనున్నాడు. ఒకపక్క బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ ప్రారంభం కానుంది. మరో పక్క పాన్ ఇండియా రేంజ్ డైరెక్షన్ ప్రశాంత్ నీల్ తన సినిమా సలార్‌ను మొదలు పెట్టేశాడు. అయితే ప్రస్తుతం ఓం రౌత్ తన సినిమాలో ప్రభాస్ లేని సన్నివేశాలు చిత్రీకరించనున్నాడట. దాంతో ప్రస్తుతానికి తనకు ప్రభాస్‌తో పనిలేదని అంటున్నాడట. ఇక ప్రశాంత్ నీల్ విషయానికొస్తే సలార్ సినిమా కేవలం 45రోజుల్లో ముగించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక నేడు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పుట్టిన రోజు. ఆమెకు బర్త్ డే విషెష్ ను తెలుపుతూ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘సలార్’ లోకి స్వాగతం అంటూ హోంబలే ఫిలింస్ సర్ ప్రైజ్ చేసింది. గత కొద్దిరోజులుగా వస్తున్న గాసిప్స్ లను నిజం చేస్తూ సలార్ హీరోయిన్ గా ‘శృతి హాసన్’ను ప్రకటించారు. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన శృతి హాసన్.. స్టార్ హీరో ప్రభాస్ తోను స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే క్రాక్ తో హిట్ కొట్టిన శృతి, వకీల్ సాబ్ లోను నటించింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం శృతి హాసన్ కు రావడం ఆమెకు ఈ ఏడాది కలిసొస్తుందనే చెప్పాలి.

Related posts