telugu navyamedia
సినిమా వార్తలు

అంతర్జాతీయ వెబ్ సిరీస్ లో శృతి హాసన్

Shruthi-Hassan

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి పేరే బ‌లంగా విన‌ప‌డుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రుతి హాస‌న్ అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ “టెడ్‌స్టోన్‌”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న “ట్రెడ్ స్టోన్‌”ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. ఢిల్లీలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ ర‌హ‌స్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్‌ ప్రాంతంలో జరగనున్న షెడ్యూల్‌లో శృతిహాసన్‌ పాల్గొననున్నారు. నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి కనిపించనుంది. అంత‌ర్జాతీయ వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్న తొలి సౌత్ భామ శృతి కావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ తో శృతికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తే… ఆమె హాలీవుడ్ లో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Related posts