telugu navyamedia
news telugu cinema news

ఆ స్టార్ హీరో సినిమాను వదులుకున్న శ్రుతిహాసన్…

Shruthi

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని కి నందమూరి బాలకృష్ణ తో అవకాశం లభించింది. ప్రస్తుతం గోపీ తను బాలయ్యతో చేయనున్న సినిమాకు కథను సిద్దం చేస్తున్నారు. అయితే వీరి కాంబో కోసం గోపీ అద్భుత ప్లాట్‌ను ఎంచుకున్నారంట. ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపించనున్నారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. క్రాక్ లో హీరోయిన్ గా చేసిన శ్రుతిహాసన్ నే ఈ సినిమాలో కూడా బాలయ్యకు జోడిగా ఉంటె బాగుంటది అని చిత్రబృందం భావించిందట… కానీ ఈ సినిమాలో చేయడానికి శ్రుతి మాత్రం నో చెపింది అని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మరోసారి హీరోయిన్ వేటలో పడ్డారు మేకర్స్. అయితే ఈ సినిమా కథను గోపీ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగానే రెడీ చేయనున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Related posts

మంత్రి పదవి కావాలని అడగలేదు: ఎమ్మెల్యే రోజా

vimala p

ఎన్నికల ఫలితాలు.. న్యూస్ చానెల్స్ మాత్రమే ప్రసారం.. ఇతర చానెళ్లు ..

vimala p

“మహా” రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ పవార్ రాజీనామా

vimala p