telugu navyamedia
సినిమా వార్తలు

చిరుతో చరణ్ ఇంటర్వ్యూ… మెగాస్టార్ తో శృతి హాసన్

Chiranjeevi-with-Shruthi-Hassan

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “సైరా” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే చరణ్ ఈ సినిమా గురించి చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్నాడని సమాచారం. ‘సైరా’ సినిమా ప్రత్యేకతలు, ఆయా పాత్రలు, లుక్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, షూటింగ్ విశేషాలు, అనుభవాలు మొదలైన విషయాల గురించి చిరంజీవిని చరణ్ ప్రశ్నలు అడగనున్నాడట. ఈ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు భారీగా హైప్ తీసుకురావడం కోసమే ఈ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారని అంటున్నారు.

ఈ చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చిరు, కొరటాల సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని ఓ కీలకమైన పాత్రకోసం శృతిహాసన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా ప్రైవేట్ ఆల్బమ్స్ తో సినిమాలకు దూరంగా ఉంది శృతి హాసన్. గతంలో మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో శృతిహాసన్ జతకట్టిన విషయం తెలిసిందే.

Related posts