telugu navyamedia
సినిమా వార్తలు

రానా తో శృతి హాసన్ రొమాన్స్ ?

Rana-and-Shruthi-Hassan

“బాహుబలి” తరువాత రానాకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం రానా విరాటపర్వం, హిరణ్యకశ్యప లాంటి భారీ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర కాంబినేషన్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రానాతో శృతి హాసన్ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో శృతి హాసన్, రానా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మరో సెల్ఫీలో శృతి హాసన్, రానాతో పాటు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి కూడా ఉండడం ఆసక్తిని రేపుతోంది. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రకాష్ తెరకెక్కించిన “అనగనగా ఓ ధీరుడు” చిత్రం ద్వారా శృతి హాసన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. దీనితో రానా, ప్రకాష్, శృతి హాసన్ ఇలా ఫోటోలు దిగడంతో వీరి కాంబినేషన్ లో సినిమా వుండబోతుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సినిమాపై అధికారిక ప్రకటన విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Related posts