telugu navyamedia
సినిమా వార్తలు

భర్తతో సీనియర్ హీరోయిన్… ఫోటోలు వైరల్

Shriya

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా కొద్దిరోజుల క్రితం తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకి చెందిన బిజినెస్ మెన్ఆండ్రె కోస్చీవ్ తో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ బ్యూటీ 2018 మార్చిలో అతడిని వివాహం చేసుకుంది. తొలిసారి ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో తన భర్తతో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ జంట పెరులో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను శ్రియ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే శ్రియ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. “వెంకీమామ” సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా శ్రియని అనుకున్నారు. ముందుగా ఈ సినిమాకు ఒప్పుకున్నా శ్రియ ఆ తరువాత తప్పుకుంది. ఇక ఇటీవల కాలంలో శ్రియకు అవకాశాలు కూడా బాగా తగ్గాయనే చెప్పాలి.

Related posts