telugu navyamedia
telugu cinema news trending

రానా స్టార్ కాదు… శ్రీయ కామెంట్స్

Rana

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన హీరో దగ్గుబాటి రానాపై హీరోయిన్ శ్రీయ పిల్గాన్కర్ ప్రశంసలు కురిపించారు. రానాతో ఈ హీరోయిన్ బాలీవుడ్ మూవీ ‘హాథీ మేరే సాథీ’ అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీయ పాత్ర షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా రానాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెట్స్‌లో ఉన్నప్పుడు రానా స్టార్ కాదన్నారు. నిత్య విద్యార్థి అని పేర్కొన్నారు. అతడి కమిట్‌మెంట్‌కు ఆశ్చర్యపోయాయని ఆమె తెలిపారు. తాను నటిస్తున్న తొలి బహుబాషా చిత్రమిదని చెప్పారు. కాగా ‘హాథీ మేరే సాథీ’ ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అడవుల్లో జంతువులతో సహవాసం చేసే వ్యక్తిగా ఈ సినిమాలో రానా కనిపించనున్నారు. ప్రభు సోలమన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలోని హీరో రానా గెటప్పులు, ఏనుగులతో ఉన్న ఫొటోలు ఆ మధ్యన వైరల్ అయిన విషయం తెలిసిందే.

Related posts

సౌత్‌లో హీరోలను చూడటానికే థియేటర్స్‌కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్

vimala p

జనసేన నుండి .. జారుకుంటున్న నేతలు..

vimala p

దొంగలకు షాక్ ఇచ్చిన పాములు, బల్లులు…!!

vimala p