telugu navyamedia
telugu cinema news

సమంతపై “జెర్సీ” హీరోయిన్… నెటిజన్లు ఫైర్

Shraddha-Srinath

పెళ్ళి తరువాత వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకెళ్తోంది సమంత. ఈ స్టార్ హీరోయిన్ సినిమాపై కామెంట్ చేసి నెటిజన్ల చేత విమర్శల పాలైంది “జెర్సీ” నటి శ్రద్ధ శ్రీనాథ్. కొంతకాలం క్రితం కన్నడలో విడుదలైన “యూటర్న్” చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో… ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసి “యూటర్న్” పేరుతో తెరకెక్కింది. కన్నడలో శ్రద్ధ శ్రీనాథ్ నటించిన పాత్రను తెలుగులో సమంత పోషించింది.

ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ నటించిన “జెర్సీ” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్ సమంతపై వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సమంత నటించిన “యూటర్న్” సినిమాను తాను అరగంట కంటే ఎక్కువసేపు చూడలేకపోయానని, తాను చాలా పొసెసివ్ అని, తాను పోషించిన పాత్రలో మరొకరిని ఉహించుకోలేక పోతున్నానని తెలిపింది. దీంతో సమంత అభిమానులు శ్రద్ధ శ్రీనాథ్‌పై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఏమాత్రం అనుభవం లేని శ్రద్ధ.. సీనియర్ హీరోయిన్, పైగా స్టార్ హీరోయిన్ అయిన సమంతపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. కొంతమంది మాత్రం శ్రద్ధ పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేసిందని అంటున్నారు. నాని హీరోగా రూపొందిన “జెర్సీ” ద్వారా శ్రద్ధ శ్రీనాథ్ తెలుగు తెరపై అడుగు పెట్టనుంది. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్

vimala p

టిక్ టాక్ లు చేసి బాధపెట్టడం దారుణం… నందితాశ్వేత కామెంట్స్

vimala p

కెనడా పౌరసత్వంపై స్పందించిన అక్షయ్ కుమార్

vimala p