telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిజమే… ఆ హీరో అంటే చాలా ఇష్టం… “సాహో” భామ కామెంట్స్

Shraddha

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటాని ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారం గురించి స్పందించకపోయినా, కలిసి బయట కనిపించడం, ఫంక్షన్లకు, విదేశీ టూర్లకు జంటగా వెళ్లడం, అక్కడి ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడం వంటివి చేసేవారు. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్టు సమాచారం. దిశా నుంచి విడిపోయిన తర్వాత టైగర్ “సాహో” భామ శ్రద్ధాకపూర్‌కు దగ్గరైనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్‌తో శ్రద్ధ కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి టైగర్‌కు దగ్గరైనట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై శ్రద్ధ స్పందించింది. `అవును.. టైగర్ ష్రాఫ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను నాకు ప్రియమైన వ్యక్తి` అని చెప్పింది. దీంతో వీరి ప్రేమాయణం గురించిన వార్తలు మరింత జోరందుకున్నాయి.

Related posts