telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాజీ బాయ్ ఫ్రెండ్ తో డాన్స్… హీరోయిన్ తలకు గాయం

Shraddha-Arya

తెలుగులో పాఠశాల, కోతిమూక, గొడవ లాంటి సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ శ్రద్దా ఆర్య. అయితే ఈ చిత్రాలేవీ ఆమెకు తెలుగులో పెద్దగా బ్రేక్ ను ఇవ్వలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. అయినప్పటికీ ఏ ఒక్క ఇండస్ట్రీలోనూ కాలం కలిసిరాకపోవడంతో టీవీ షోలపై ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నబాలీవుడ్‌ ఫేమస్ డ్యాన్స్ షో “నాచ్ బలియే”లో ఆమె పార్టిసిపేట్ చేస్తోంది. అయితే తాజాగా “నాచ్ బలియే-9” డాన్స్ షోలో శ్రద్దా ఆర్య గాయపడ్డారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ అలమ్ మక్కర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంటున్న శ్రద్దా ఆర్య… తాజా ఎపిసోడ్‌లో స్టేజీపై పెర్ఫామ్ చేస్తుండగా గాయపడ్డారు. ఓ స్టెప్ వేస్తుండగా బాయ్‌ఫ్రెండ్ చేతుల నుంచి పట్టు తప్పి కిందపడిపోవడంతో ఆమె తలకు గాయమైంది. ఆ క్షణంలో ఒక్కసారిగా తన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందని శ్రద్దా తెలిపారు. “అలమ్‌కు,నాకు ఇదో చేదు అనుభవం. రిహార్సల్స్ సమయంలో మేము మరింత కేర్ తీసుకోవాల్సింది. షోలో జడ్జిల ముందు పెర్ఫామ్ చేస్తుండగా స్లిప్ అయి కిందపడ్డాం. అయితే పెద్దగా గాయాలేమి కానప్పటికీ.. తలపై కొద్దిగా బొప్పి కట్టింది. నేను కిందపడిపోయినప్పటికీ.. వెంటనే తేరుకుని పెర్ఫామెన్స్ పూర్తి చేశాం” అని తెలిపింది శ్రద్ధ.

Related posts