telugu navyamedia
రాజకీయ

త్వరలో మంత్రివర్గ విస్తరణ..సీనియర్లకు డౌటే?

Woman candidates kcr cabinet Telangana
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 10న కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పదిమందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ యోచిస్తుండగా.. దీనిపై పలు ఆసక్తికరమైన విషాయాలు బయటకు వస్తున్నాయి.
 టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్‌కు, మాజీ మంత్రి హరీష్‌ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సీనియర్లకు మెండిచెయ్యి ఎదురైయ్యే అవకాశం ఉంది.  పార్టీ పదవులు నిర్వహించే వారికి మంత్రి పదవులు ఉండవని కేసీఆర్ గతంలోనే చెప్పారు. ఈ కారణంతో గత ప్రభుత్వంలో అమాత్యులుగా సేవలందించిన కొంతమంది సీనియర్లకు ఈసారి అవకాశం రాకపోవచ్చని అంటున్నారు.

Related posts