telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు

two days rains in telugu states

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి వస్తాయని, 13 లేదా 14న తెలంగాణకు విస్తరిస్తాయని వెల్లడించారు. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ప్రభావంతో శనివారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, జనగామ, రంగారెడ్డి, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 5-8 సెం.మీ.ల వరకు వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు.

Related posts