telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్‌ కు షాక్ ఇచ్చిన ప్రతినిధుల సభ…

trump usa

బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశం కాగా.. దీనిని వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.. పెద్దఎత్తున్న ఏకంగా క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టారు. విధ్వంసమే సృష్టించారు.. ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి.. అయితే, దీనిని ట్రంప్‌ ప్రోత్సహించారన్న ఆరోపణలతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది… ఈ అభిశంసన తీర్మానాకి అనుకూలంగా.. అంటే ట్రంప్‌కు వ్యతిరేకంగా 231 ఓట్లు రాగా… తీర్మానానికి వ్యతిరేకంగా అంటే ట్రంప్‌కు అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి.. అంతేకాదు పలువురు రిపబ్లికన్లు కూడా వ్యతిరేకంగా ఓటు వేసి డొనాల్డ్ ట్రంప్‌కు షాక్‌ ఇచ్చారు. దీంతో, అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచాడు ట్రంప్‌.. కాగా, 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలంటూ.. డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోమవారమే ఈ తీర్మానం సభ ముందుకు రాగా.. రిపబ్లిక్‌ సభ్యులు అడ్డుకున్నారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ పెన్స్‌ కూడా సుముఖంగా లేనని చెప్పుకొచ్చారు.. కానీ, స్పీకర్‌ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. పెన్స్‌ ఈ తీర్మానాన్ని తోసిపుచ్చగా.. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై చర్చ సాగింది. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని మెజార్టీ సభ్యులు ఓటేయడంతో అభిశంసనకు గురయ్యారు డొనాల్డ్ ట్రంప్‌. తన పదవి కాలంలో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు, దూకుడైన నిర్ణయాలతో ఎప్పుడు వార్తల్లో ఉండే ట్రంప్‌.. చివరకు సంచలనమే సృష్టించాడు.

Related posts