telugu navyamedia
సినిమా వార్తలు

సాహో అప్డేట్ : భారీ రేటుకు ఓవర్సీస్ హక్కులు

Saaho

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం చాలావరకు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం నుంచి ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-1″ అంటూ గతంలో విడుదల చేసిన వీడియోతో ప్రేక్షకుల్లో సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా శ్రద్ధాకపూర్ పుట్టినరోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2” పేరుతో శ్రద్ధాకపూర్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది.

తాజాగా “సాహో” గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “సాహో” ఓవర్సీస్ హక్కులను యూఏఈకి చెందిన ఓ సంస్థ రూ.42 కోట్లకు తీసుకుందని తెలుస్తోంది. “బాహుబలి” తరువాత ఈ స్థాయిలో ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్న సౌత్ సినిమా ఇదే కావడం విశేషం. బాహుబలి-2 సినిమా 72 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యి 170 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts