telugu navyamedia
సినిమా వార్తలు

మరో వివాదంలో సల్మాన్ ఖాన్

Salman-Khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ “దబాంగ్-3” సినిమాలో నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతోంది. సల్మాన్ ఖాన్ పుట్టింది కూడా ఇక్కడే. అందుకే సినిమా చిత్రీకరణలో మొదటి సన్నివేశాన్ని ఇక్కడే షూట్ చేయాలని భావించిన చిత్రబృందానికి షాక్ తగిలింది. మహేశ్వర్ ప్రాంతంలో నర్మదా నదీ తీరాన చిత్రబృందం షూటింగ్ కోసం ఓ సెట్ ను నిర్మించింది. ఆ సెట్ లో చెక్కల కింద శివలింగం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆరోపించారు. ఇక ఈ ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపడంతో సల్మాన్ ఖాన్ ఈ విషయంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. శివలింగంపైన చెక్కలు పెట్టలేదని, షూటింగ్ పూర్తయ్యే వరకు అది పాడవకుండా ఉండాలని అలా దాచామని, షూటింగ్ పూర్తయిన తరువాత వెంటనే తీసేస్తామని తెలిపారు.

Related posts