telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

రాజకీయ చదరంగంలోకి.. షిర్డీ ..ఆస్తుల కోసమేనా.. మింగేశారా ..!

shirdi shut down on political interfere

రాజకీయ కబంధ హస్తాలలోకి షిర్డీ వెళ్లనుందా.. ప్రస్తుత పరిస్థితులు దీనికి సాక్ష్యాలేనా…మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించడమే ఈ వివాదానికి మూలం. ఈ నేపథ్యంలో పర్భణీ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని సీఎం ఉద్ధవ్‌ థాక్రే నిర్ణయించారు. దీని కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయంపై షిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గద్దెనెక్కుతున్న తరుణంలో ఉద్ధవ్‌ థాక్రే సకుటుంబ పరివారంగా షిర్ది తరలి వచ్చారు. బాబాను దర్శించుకున్న థాక్రే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు భక్తుల మనోభావాలకు విఘాతం కలిగే విధంగా సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసన జ్వాలలు చివరికి తెలుగు రాష్ట్రాలకు తాకినట్టుగా కన్పిస్తుంది.

పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆలయాన్ని మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశంకానున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో షిరిడీ ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాయిబాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రే పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ‘పత్రి’ ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకిస్తూనే ట్రస్ట్ ఆలయం మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. షిరిడీకి వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న భక్తులు గందరగోళంలో ఉన్నారు. వెళ్లాలా వద్దా అనే సందిగ్థంలో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ-మహారాష్ట్ర సర్కార్ మధ్య దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.

Related posts