telugu navyamedia
సినిమా వార్తలు

భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు ?

Shilpa-Shetty-with-Family

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. దీంతో శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇప్పటికి కూడా ఆమె బుల్లితెరపై కన్పిస్తూ తన గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో విడాకులు తీసుకోనుందనే వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో ఆమె సన్నిహితులు, అభిమానులు కూడా ఆందోళన చెందారు. స్వయంగా శిల్పాశెట్టి ఫోన్ నుంచి తన తల్లిదండ్రులకు “నేను, రాజ్ కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం” అనే మెసేజ్ వెళ్లిందట. దీంతో షాక్ కు గురైన ఆమె తల్లి సునంద శెట్టి విషయం ఆరా తీశారు. జరిగింది తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.

అసలు విషయంలోకి వస్తే… శిల్పాశెట్టి, అనురాగ్ బసు, గీతా కపూర్ లు “సూపర్ డాన్స్-3” అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే శిల్పాశెట్టికి తెలియకుండా అనురాగ్ ఆమె ఫోన్ తీసుకొని ఆమె తల్లి సునంద శెట్టికి విడాకులకు సంబంధించిన సందేశం పంపారు. మెసేజ్ చూసి కంగారు పడిపోయారు ఆమె కుటుంబ సభ్యులు, ఆమె తల్లి సునంద శెట్టి. కూతురు శిల్పాశెట్టికి ఫోన్ చేసి విషయం ప్రస్తావించగా… అప్పుడు గీతాకపూర్, శిల్పాశెట్టికి అసలు విషయం చెప్పారట. దీంతో శిల్పా వెంటనే తన తల్లికి ఫోన్ చేసి అదేం లేదని ఇలాంటి విషయాలు నాకు నేనుగా ఇంటికి వచ్చి చెప్పేంత వరకు నమ్మొద్దని చెప్పిందట. 11 సంవత్సరాల క్రితం శిల్పా, రాజ్ కుంద్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

Related posts